తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్ ప్లాజా వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా భవన్లోని తన నివాసంలో బతుకమ్మను పేర్చి స్వయంగా తలపై ఎత్తుకొని వచ్చి మహిళలతో కలిసి ఆడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.