రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎం. చిమ్నా తెలిపిన వివరాలు. గుర్తుతెలియని వ్యక్తి (35) జామై ఉస్మానియా - విద్యానగర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.