గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మ గూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నేషనల్ లెవల్ హ్యకథాన్ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ శ్రీదేవి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగే హ్యాకథాన్ లో 5 రాష్ట్రాలకు చెందిన 150 మంది విద్యార్థుల బృందాలు పాల్గొని పలు సమస్యలకు వినూత్న పద్ధతిలో పరిష్కారాలు చూపనున్నట్లు కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి, ప్రిన్సిపాల్ లోకనాథం తెలిపారు.