కీసర, చీర్యాల గ్రామాల్లో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.