ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో 31 మంది లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే త్వరగా చెక్కులు వచ్చేలా చూస్తామన్నారు. పేద ప్రజలు కార్పొరేట్ స్థాయి వైద్య సేవల కోసం సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.