త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తా: బీజేపీ నేత

81பார்த்தது
త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తా: బీజేపీ నేత
మీట్ యువర్ మెంబర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మహేంద్రహిల్స్ లోని సంజీవ్ నగర్ కాలనీలో కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మంచికోసం మార్పు మనతోనే మొదలవ్వాలన్నారు.
కాలనీవాసులు సమస్యలను రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు, వరద నీటి కాలువ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమస్యలపై ఆయన స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி