ఇటీవల బాలానగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన టి. నరసింహారాజుని హెచ్ఎల్, ఐయన్టియుసి యూనియన్ ప్రధానకార్యదర్శి కర్కనాగరాజ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫూలబోకేతో శుభాకాంక్షలు తెలియజేసారు. శాంతి భద్రతల విషయంలో ముక్కు సూటిగా పనిచేస్తారని ఆశభావంవ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వెంకటపతి, పోలేపల్లి శ్రీకాంత్, కుతాడి కృష్ణా, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.