బాలానగర్ మండలం పరిధిలో దాదాపుగా 700 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ప్రత్యేక నివేదికను సిద్ధం చేయడంపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.