హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేపై అపోహలొద్దు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. సర్వేకు ఆటంకాలు కల్పిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించారు.