సీఎం సహాయనిధి కింద రావాల్సిన చెక్కులు సకాలంలో వస్తాయని, లబ్ధిదారులకు త్వరితగతిన చెక్కులు పంపిణీ చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. బుధవారం ఎమ్మెల్యే ఇందిరానగర్‌లో నివసించే చంద్రశేఖర్‌కు రూ. 2. 50 లక్షల ఎల్ ఓసీని అందజేశారు. సీఎం సహాయ నిధి కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. మూడు నెలల్లో చెక్కులు మంజూరవుతున్నాయన్నారు.