చెత్త వేయడానికి ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటలోని శాంతినగర్ లో నివాసముండే నల్ల కిరణ్ కు నల్ల నాగరాణితో వివాహమైంది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం అయిదు గంటలకు చెత్త వేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వాకబు చేసిన ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు.