తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రూపు-1 అభ్యర్ధులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి సెక్రటేరియట్ ఎదురుగా బైఠాయించారు. సీఎం డౌన్ దౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మద్దతు పలికారు. ఆందోళనకారులను పోలీసులు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. కేసుల్లో ఇరుక్కోవద్దంటూ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.