ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేయడం నీచమైన చర్య అని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ పై దాడిని నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్లకార్డులు చెత్త పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. అరవింద్ కేజ్రివాల్ పై దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.