ఖైరతాబాద్ జోన్ వ్యాప్తంగా నవంబర్ 6 వ తేది నుంచి ప్రారంభమయ్యే సకుటుంబ సర్వేపై జెడ్సీ అనురాగ్ జయంతి సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్పెషల్ మీటింగ్ నిర్వహించారు. అధికారులకు వివిధ అంశాలను వివరించి దిశ నిర్దేశం చేశారు. 100% కచ్చితత్వంతో సర్వే జరగాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సర్వే నిర్వహించాలని సూచించారు.