గోల్కొండ నుంచి సెవెన్ టుంబ్స్ వరకు రోప్ వే ఏర్పాటు కోసం అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. సెవెన్ టుంబ్స్ నుండి గోల్కొండ పోర్ట్ వరకు ప్రతిపాదిత ఓవర్ హెడ్ స్కై కేబుల్ ప్రాజెక్టును బుధవారం పరిశీలించారు. అతి త్వరలో ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి స్కై కేబుల్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ కో-కార్పొరేటర్ అమీర్ పాల్గొన్నారు.