నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చూడాలని నూతన అధికారులకు కార్వాన్ ఎమ్మేల్యే కౌసార్ మొహియుద్దీన్ సూచించారు. ఆదివారం మెహిదిపట్నం సర్కిల్ కు నూతనంగా నియమితులైన విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యేను కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని సమస్యలపై చర్చించారు. ప్రజలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.