జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందితో కార్పొరేటర్ సమీక్ష సమావేశం

84பார்த்தது
జీహెచ్ఎంసీ శానిటేషన్, రాంకీ సిబ్బందితో కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న దసరా పండుగను పురస్కరించుకుని డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో ఉన్న చెత్తను వెంటనే క్లియర్ చేయాలన్నారు. అలాగే పండుగ తర్వాత కూడా శానిటేషన్ డ్రైవ్ ద్వారా చెత్తను క్లియర్ చేయాలని సిబ్బందికి సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி