సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై ఓయు జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం దాడి చేసిన నేపథ్యంలో పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాలను అనుసరించి స్థానిక పోలీసులు హీరో సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.