హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ జితేందర్ తెలిపారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.