బాలికను ఓ దుండగుడు కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన పాతబస్తీ పరిధిలోని పురణాపుల్ లో చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం. ఓ దుండగుడు గత మూడు రోజుల నుంచి బాలిక స్కూల్ కి వెళ్లి వచ్చే క్రమంలో వెంబడిస్తున్నాడని తెలిపారు. నిన్న ఏకంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని వాపోయారు. బాలిక తప్పించుకుని వచ్చిందని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు.