చాంద్రాయణగుట్ట: ఈనెల 5న ఆటో డ్రైవర్ల మహధర్నా
ఈనెల 5న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు నగరంలోని ఆటో డ్రైవర్ సంఘాలు శనివారం తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేపట్టడంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయాయి. ధర్నాకు ఆటంకం కలిగించడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వెనుకడుగు వేయకుండా డ్రైవర్లంతా తరలి రావాలని పిలుపునిచ్చింది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.