హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం ఆరు కారిడార్లు, 116.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.