భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడి షీటర్ కు 30 రోజుల జైలు శిక్షను నాంపల్లి న్యాయస్థానం విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. షరీఫ్ అనే పేరు గల రౌడీ షీటర్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు సమాచారంపై అతన్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం అతనికి 30 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.