ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ అన్నారు. శుక్రవారం ఎంఐఎం కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేను కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్న కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.