ఓయూలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
ఉస్మానియా యూనివర్శిటీలో శనివారం జరిపిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణకు చెరువులే జీవనాధారం అని చెరువులు నిండితేనే పంటలు పండుతాయని అందుకే బతుకమ్మ పండుగలో చెరువుల శుద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బతుకమ్మ పూలు నీటిని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటాయని పేర్కొన్నారు. పసుపు, కుంకుమలు గౌరమ్మ ప్రతీక అయితే బతుకమ్మ మహిళలకు శక్తినిచ్చే పండుగ అని మంత్రి అభివర్ణించారు.