అంబర్పేట్ న్యూతులసి రామ్ నగర్లో మూసి నది పరివాహక ప్రాంత ప్రజలు గత వారం రోజుల నుండి తిండి తిప్పలు నిద్రాహారాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు పోతుందనే టెన్షన్‌తో బుధవారం ఉదయం కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.