నత్త నడకన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు.. గుంతల మయంగా రోడ్డు

76பார்த்தது
నగరంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గుంతల రోడ్లతో వాహనదారులు నరకం చూస్తున్నారు. కొన్నేళ్లుగా అంబర్ పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారింది. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி