అంబర్పేట్ నియోజకవర్గంలోని శివంరోడ్ ఆజాం కాంప్లెక్స్ వద్ద శనివారం ప్రధాన రహదారి కుంగిపోయింది. అటు వైపుగా వెళ్తున్న టిప్పర్ గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక కార్పొరేటర్ పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరిస్తూ ట్రాఫిక్ ను మళ్లించారు.