అంబర్ పేట్ నియోజకవర్గ పరిధి గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ లంకలో బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మూసి బాధితులతో ఆయన మాట్లాడారు. ఎవరు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ఓ వైపు బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేపట్టారన్నారు. ఎవరు భయపడవద్దని బీజేపి పేదలకు అండగా ఉంటుందన్నారు.