నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు అన్నారు. గురువారం ఆమె జయంతిని పురస్కరించుకుని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వద్ద ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర మహిళలకు ఆదర్శనీయమని అన్నారు.