కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ అన్నారు. బుధవారం ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 102 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయకుమార్ గౌడ్, అమృత, పద్మా వెంకటరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.