రెండేళ్లుగా తన భార్య తనను ముట్టుకోనివ్వడం లేదని ఓ భర్త బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరుకు చెందిన శ్రీకాంత్, బిందుశ్రీ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుడితే అందం పాడైపోతుందని రెండేళ్లుగా శ్రీకాంత్‌ను బిందుశ్రీ దూరం పెడుతూ వచ్చింది. తనను తాకితే చనిపోతానని శ్రీకాంత్‌ను బెదిరించింది. ఎన్ని రోజులు ఎదురు చూసినా మారకపోవడంతో శ్రీకాంత్ విసిగిపోయాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.