ఇరాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో 30 మంది కార్మికులు మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కావడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో గనిలో 70 మంది పని చేస్తున్నట్ల సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి.