పరిశ్రమలో భారీ పేలుడు.. నలుగురు మృతి

80பார்த்தது
పరిశ్రమలో భారీ పేలుడు.. నలుగురు మృతి
గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అంకలేశ్వర్‌లో మంగళవారం ఓ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు మృతి చెందారు. రసాయన ప్రక్రియలో పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎంఈ ప్లాంట్‌లోని స్టీమ్ ప్రెజర్ పైపు పగిలిపోవడంతో పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி