ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ట్రేబర్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన లుకేమియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఇటీవల అనారోగ్యం మరింత క్షీణించడంతో మరణించారు. కాగా రాబర్ట్ ట్రేబర్.. హెర్క్యులస్, అండ్ లాస్ట్ కింగ్డమ్, హెర్క్యులస్: ది లెజెండరీ జర్సీస్, యూనివర్సల్ సోల్జర్, సన్ ఆఫ్ సామ్ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.