హెజ్‌బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించారు. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. దీంతో ఆయన మృతి చెందినట్టు తాజాగా ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.