ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘హెలికాఫ్టర్ షాట్- చీనాబ్ బ్రిడ్జ్’ అంటూ ఈ పోస్టులో రాసుకొచ్చారు. ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన ఈ వంతెన జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ డివిజన్ రియాసి జిల్లా బక్కల్ – కౌరీ మధ్య ఉంది. నెట్టింట ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.