తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో గగనతలంపై హెలికాప్టర్ వెళ్లింది. శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకూడదని ఆగమశాస్త్ర నిబంధన. అయినా తిరుమల మీదుగా హెలికాప్టర్లు తిరగడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏవియేషన్ అధికారులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తిరుమలను నోఫ్లైయింగ్ జోన్‌గా గుర్తించలేమని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. విమానాశ్రయం సమీపంలో ఉన్నందున ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.