బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రేపు తీర ప్రాంతాల్లో 45 - 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.