మహిళల్లో వచ్చే డీప్ వీన్ థ్రాంబోసిస్ సమస్య గురించి విన్నారా? గర్భధారణ నుంచి హార్మోన్ల సంక్లిష్టితల వరకు అనేక అంశాలు డీప్ వీన్ థ్రాంబోసిస్(డీవీటీ)కు దారి తీస్తాయి. రక్తనాళాల్లో.. ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని డీవీటీగా చెబుతారు. రక్తం గడ్డ కట్టిన చోట చర్మం వాపు రావడం, చర్మం ఎర్రబారి వేడిగా ఉన్నట్లు అనిపించడం, బలహీనంగా ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.