తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు దొంగ లెక్కలు చూపించలేదు.. ఉన్నది ఉన్నట్లు చెప్పారు. ఈటల, కేసీఆర్ ఆర్థిక శాఖ చూసినప్పుడు దొంగ లెక్కలు చూపలేదు.. కానీ హరీశ్ రావు దొంగ లెక్కలు రాశారు. అప్పులు ఎక్కడ ఉన్నాయో, తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడకుండా చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా చేస్తున్నారు' అని ఫైర్ అయ్యారు.