తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీశాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లు, గురుకులాల అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని భట్టి అధికారులను ఆదేశించారు. గురుకులాలను ప్రజాప్రతినిధులు సందర్శించేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు. కేంద్ర పథకాల నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు.