మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వరరావుపై దుండగులు దాడి చేసిన ఘటన జూబ్లీహిల్స్ PSలో పరిధిలో చోటుచేసుకున్నది. ఓ కేసు నిమిత్తం ఈశ్వరరావు శ్రీకృష్ణానగర్ వెళ్లగా అదే సమయంలో మద్యం తాగుతున్న ముగ్గురు యువకులు గొడవ పడుతుండడం చూసి వారిని వారించి ఇంటికి వెళ్ళిపోండని హితువు పలికారు. ఇందుకు ఆగ్రహించిన దుండగులు అతనిపై దాడి చేశారు. తప్పించుకోవడానికి యత్నిస్తుండగా వెంటపడి దాడి చేసినట్లు ఆయన తెలిపారు.