AP: లక్షల్లో ఒకరికి మాత్రమే సోకే వ్యాధి జీబీఎస్ అని ఏపీ వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి. కృష్ణబాబు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 కేసులే నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మనవద్ద 1,200 ఇమ్యునోగ్లోబ్యులిన్ వయల్స్ ఉన్నాయని తెలిపారు. మరో 7,600 వయల్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని టి. కృష్ణబాబు స్పష్టం చేశారు.