వనపర్తి జిల్లా మదనాపూర్ మండలంలోని తిర్మలాయ పల్లికి చెందిన రిపోర్టర్ రవి కూతురు గీతిక దేవి కడుపు నొప్పితో బాధ పడుతుండగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు పాప పొత్తి కడుపులో ఉండే ప్యాంక్రియాస్‌లో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ కోసం రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వ లేక కూతురి ఆరోగ్యం కోసం తపన పడుతున్న ఆయనకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రవి వేడుకుంటున్నారు.