వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో ఏసీబి అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ వివరాలు.. మున్సిపాలిటీలో జనరల్ ఫండ్స్ నుంచి 2023లో కాంట్రాక్టర్ చేసిన పనులకు దాదాపు రూ. 2, 51, 790 బిల్లులు రావాల్సి ఉంది. ఇందుకు గాను కమిషనర్ రూ. 25 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో దాడులు చేపట్టారు.