వనపర్తి జిల్లా అమరచింత మండలం ధర్మపురం గ్రామానికి రెండు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు శనివారం కల్లుగీత డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ కే నాగరాజ్ గౌడ్ తెలిపారు. ధర్మపురం ప్రజలకు రోడ్డు లేదని గ్రామ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్లు మంజూరు చేసిందన్నారు. డిఈ ప్రవీణ్ కుమార్, ఏఈ విశ్వ రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డితో కలిసి ధర్మపురం రోడ్డును పరిశీలించారు.