వనపర్తి జిల్లాలోని కేజీబీవీలలో కాంట్రాక్టు పద్ధతిన ఏఎన్ఎం అకౌంటెంట్లుగా పని చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ డా. గోవిందరాజులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏఎన్ఎం-04, అకౌంటెంట్-03 ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21 వరకు డీఈఓ ఆఫీస్ లో దరఖాస్తుల సమర్పించాలని అన్నారు. ఇతర వివరాలకు డిఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.