ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు. శనివారం నారాయణపేట అంబేద్కర్ భవన్ లో జరిగిన తెలంగాణ విద్యారంగం సమస్యలు, సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉపాద్యాయుల సర్దుబాటు జీఓ వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.