నాగర్ కర్నూల్ జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ పరేడ్ మైదానంలో ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్లకు జిల్లా ఎస్పీ పోలీస్ దర్బార్ శనివారం నిర్వహించారు. ఈ దర్బార్లో భాగంగా నాగర్ కర్నూల్ ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల వినతులను స్వీకరించారు. వారికి సంబంధించిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా చేయడానికి హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్వయంగా తనను సంప్రదించవచ్చని తెలిపారు.